Loading...

16, ఏప్రిల్ 2019, మంగళవారం

ఏమి చేతునో!

నిరతము నంతరంగముననీకముఁ జేయుచు వేగుచున్న, దే
తరుణము నెట్టులౌనొ యని తాళగ జాలని యుత్సుకమ్ము నే
నరయని కొత్త యూహల, ననల్పముగా జనియింపజేయగా
సరగునఁ జేరు కల్పనల ఝల్లను యుల్లము నేమి చేతునో!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి