Loading...

16, నవంబర్ 2022, బుధవారం

మాధురులు

 మదిలో కల్పనఁజేసినట్టి తరి మర్మమ్మైన సందేశమై,
పదమై పల్క గదే, నితాంతముగ భావావేశమందొప్పు నా
హృదినాధారమవైన ధారవుగ, నా హృద్యంపు పద్యమ్ముగా
కదళీపాకమువోలె మాధురులు పొంగారంగ దీవింపుమా!

--లక్ష్మీదేవి 
మత్తేభవిక్రీడితము 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి