Loading...

14, నవంబర్ 2022, సోమవారం

దీక్ష

 చదువుల సారమెల్లఁగన శక్తినొసంగుము శారదాంబికా!

కదలని దీక్షనిచ్చి నను కంకణబద్ధగ నుండనిమ్ము, నీ
కదనపు లోకసీమఁ గల కయ్యములంబడి యేగు తత్వమున్
వదలగఁజేయుమందు, నొగి భవ్యపథమ్మునుఁజూపమందు నిన్.

--లక్ష్మీదేవి 
చంపకమాల. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి