కేరళలో సుప్రసిద్ధమైన మళయాళ జోల పాట. ఈ పాట పుట్టిన పురాతన సందర్భాన్ని కథలుగా చెప్పుకుంటారు.
----
వీలైనంతా అనువదించాను. కొన్ని పాఠభేదాలు కూడా కనిపించాయి లిరిక్స్ లో ఒక్కో లింక్ లో ఒక్కొక్క విధంగా అమరిక ఉంది.
--
చల్లని జాబిలి చిరునవ్వో
తెల్లని కోమల తామర పువ్వో
పువ్వున నిండిన మధువో
పరిపూర్ణేందుబింబపు కళవో
కొంగొత్త పగడపు మొగ్గో
చిన్ని చిలుకల ముద్దుల పలుకో
నాట్యములాడేటి నెమలో
మృదు పంచమం పాడు కోయిలో!
తుళ్ళు తుళ్ళింతల మెకమో
ధవళపు కాంతుల రాయంచవో
ఈశ్వరుండొసగే నిధియో
పరమేశ్వరి కేలిని శుకమో
పారిజాతంపు తలిరాకో
నా భాగ్యలతఁ గాయు ఫలమో
వాత్సల్య రత్నమ్ము నుంచు
కాంచన భరిణ రూపమ్మో
దిగదుడుపుల జేయు మంతిరమో
చీకటులఁ దుంచే దీపమ్మో
కీర్తివల్లరుల మూల విత్తనమో
మాసిక తోచని ముత్తెమ్మో
తిమిరాలఁ దోసి వెలిగేటి
అల్ల మార్తాండదేవుని ప్రభయో
సూక్తుల నుండు సారమ్మో
సూక్ష్మమయిన వీణారావమ్మో
పాకిన సంతోష వల్లులా
చిగురులఁ దూగేటి పువ్వో
పరిమళమల్లెల పూచెండో
నోరూరంగఁ జేసేటి కలకండో
కస్తూరి గంధ పరిమళమో
సత్యవంతుల పేర్మి సద్గుణమో
సురభిళమలయ మారుతమో
కనకశుద్ధికి ఒదవు ఏ పసరో
,
మీగడ పాలంటి రూపమ్మో
నెత్తావులీనేటి పన్నీరో
సాత్త్విక క్షేత్రపు సుఫలమో
ధర్మము కొలువుండు గృహమో
దప్పిని తీర్చేటి జలమో
బడలిక తీర్చేటి ఆశ్రయమో
వాడని మల్లియ పువ్వో
నాకు దక్కిన పెన్నిధియో
తొలిచూపుల శుభ దరిశనమో
నాకు దక్కిన చింతామణియో
పున్నెము పొందిన నదియో
ఆ కన్నని లీల విలాసమో
లక్ష్మీ భగవతి తిలకమ్మో
నా బిడ్డని పోలిన కృష్ణుండో
పద్మనాభుని కానుక వేమో
నా ముంగిట వాలిన భాగ్యమ్మో
-
లక్ష్మీదేవి.
Omanathinkal Kidavo (Malayalam: ഓമന തിങ്കള് കിടാവോ) is a lullaby in Malayalam that was composed by Irayimman Thampi on the birth of Maharajah Swathi Thirunal of Travancore (16 April 1813 – 27 December 1846) . To date, it remains one of the most popular lullabies in the Malayalam language
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి